- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీహార్ ఎన్నికలపై ఢిల్లీ ప్రభావం ఉండదు
ఈ విషయంలో ఆర్జేడీ నేత తేజశ్వీ యాదవ్ స్పందిస్తూ.. ఢిల్లీ రిజల్ట్ బీహార్‌పై ప్రభావం చూపించవని చెప్పారు.

- ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం బీహార్ ఎన్నికలపై ఉండదు. బీహార్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమే లేదని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. బీహార్ ప్రజలకు బీజేపీ పనితనం ఏంటో తెలిసిపోయిందని, ఆ పార్టీకి ఇప్పుడు ఎవరూ ఓటేయరని లాలూ అన్నారు. బీహార్‌లో బీజేపీ ప్రభావమే ఉండదు.ఇక వాళ్లు ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరని లాలూ ప్రశ్నించారు. ఢిల్లీలో బీజేపీ 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో 48 సీట్లు గెలుచుకొని దశాబ్దానికి పైగా పాలించిన ఆప్ ప్రభుత్వాన్ని ఓడించింది. దీంతో ఎన్డీయే లీడర్లు ఇదే ఊపును బీహార్‌లో కూడా కొనసాగిస్తామని చెప్తున్నారు. బీహార్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఎంతో లబ్ది జరుగుతుందని జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ అన్నారు. ఈ ఏడాదిలో జరగనున్న బీహార్ ఎన్నికల్లో ఢిల్లీకి మించిన ఫలితాలను సాధిస్తామని ఆయన చెప్పారు. కాగా, ఈ విషయంలో ఆర్జేడీ నేత తేజశ్వీ యాదవ్ స్పందిస్తూ.. ఢిల్లీ రిజల్ట్ బీహార్‌పై ప్రభావం చూపించవని చెప్పారు. బీహార్ బీహారే.. ఢిల్లీ ఢిల్లీనే అని అన్నారు. బీహార్ రాజకీయాలను బీజేపీ అర్థం చేసుకోలేదని తేజశ్వీ పేర్కొన్నారు.






