- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kejriwal: ఆప్ చీఫ్ కేజ్రీవాల్ పై కేసు నమోదు
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. కేజ్రీవాల్ సహా పలువురు ఆప్ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో శివకుమార్ సక్సేనా ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగానే ఆయనపై కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా కేజ్రీవాల్ పై కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు కోర్టుకు నివేదికను సమర్పించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోందని, మరింత సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో తదుపరి విచారణను ఏప్రిల్ 18కి కోర్టు వాయిదా వేసింది.
అసలేం జరిగిందంటే?
2019లో ద్వారకలో భారీ హోర్డింగ్‌లు ఏర్పాటుచేయడానికి ప్రజానిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ శివకుమార్ సక్సేనా అనే వ్యక్తి ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు (Delhi Court)లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్‌తో పాటు, మాజీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్, మాజీ కౌన్సిలర్ నితికా శర్మపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో, కేజ్రీవాల్ పై కేసు నమోదైంది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఈ విషయంపై ఆప్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ.. ఆప్ లక్ష్యంగా బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.






