- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూ ఇయర్ క్రాక్‌డౌన్.. ఢిల్లీలో 660 మంది అరెస్ట్!
కొత్త సంవత్సరం వస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 660 మందిని అరెస్ట్ చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: కొత్త సంవత్సరం ముందు దేశ రాజధానిలో అధికారులు ‘ఆపరేషన్ ఆఘాత్ 3.0’ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో 660 మందికిపైగా అరెస్టులు జరిగాయి. సౌత్ ఢిల్లీ, సౌత్ ఈస్ట్ ఢిల్లీలో ఈ అరెస్టులు జరిగాయని, ఇదే సమయంలో డజన్లకొద్దీ ఆయుధాలు, భారీగా నగదు, అక్రమ మద్యం, డ్రగ్స్, ఇతర దొంగిలించిన వస్తువులను కూడా సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ ఫెస్టివ్ మూడ్‌లో ఉండగా ఎలాంటి దాడులు జరగకుండా అడ్డుకునేందుకు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో సౌత్, సౌత్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ పోలీసులు సంయుక్తంగా ఢిల్లీలో పలుచోట్ల తనిఖీలు చేపట్టారు. ఒక్క సౌత్ ఈస్ట్ ఢిల్లీలోనే 285 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆర్మ్స్ యాక్ట్, ఎక్సైజ్ యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్ట్, గ్యాంబ్లింగ్ యాక్ట్ తదితర చట్టాల కింద వీరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అలాగే 2,800 మంది కన్నా ఎక్కువ మందిని ప్రశ్నించినట్లు చెప్పారు.






