- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi: మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్.. ఢిల్లీలోని ఈసీ కార్యాలయం ఎదుట హైడ్రామా
ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కార్యాలయం వద్ద ఇవాళ రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతల బృందాన్ని లోపలికి వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో ఈసీ ఆఫీస్ మెయిన్ గేట్ల వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా బరిలోకి దిగిన మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) నామినేషన్ అఫిడవిట్‌లో లోపాలు ఉన్నాయంటూ రిటర్నింగ్ అధికారి ఆమె అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. తెలంగాణలో ఉన్న ఓ పెండింగ్ కేసు వివరాలను ఆమె అఫిడవిట్‌లో దాచారంటూ బీజేపీ అభ్యర్థి మహేష్ కేవట్ (Mahesh Kevat) దాఖలు చేసిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆమె నామినేషన్ తిరస్కరణపై కేంద్ర ఎన్నికల సంఘానికి అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) నేతృత్వంలోని ముఖ్యనేతల బృందం ఢిల్లీలోని ఈసీ కార్యాలయానికి చేరుకుంది.
గేట్లకు తాళాలు.. కాంగ్రెస్ నేతల ఆగ్రహం
కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఈసీ కార్యాలయం వద్దకు రాగానే, అక్కడి భద్రతా సిబ్బంది వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా, లోపలికి ఎవరినీ అనుమతించబోమంటూ ఈసీ కార్యాలయం ప్రధాన గేట్లకు తాళాలు వేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన సీనియర్ నేతలను, ఎంపీలను కనీసం ఫిర్యాదు ఇచ్చేందుకు కూడా అనుమతించకపోవడంపై జైరాం రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన కేసీ వేణుగోపాల్ (KC Venugopal), సచిన్ పైలట్‌లు ఈసీ ఆఫీసు ఎదుట బైఠాయించారు.






