- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశ రాజధాని ఢిల్లీ MCD ఉప ఎన్నికల ఫలితాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత MCDలో 12 కార్పోరేటర్ల స్థానాలు ఖాళీ అయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత MCDలో 12 కార్పోరేటర్ల స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో 12 స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యం కాగా నవంబర్ 30న పోలింగ్ నిర్వహించారు. ఈ పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ రోజు (03-12-2025) ఉదయం ప్రారంభించగా కేవలం రెండు గంటల్లోనే పూర్తి ఫలితాలు వచ్చాయి. మొత్తం 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. అధికారంలో ఉన్న BJP 7 స్థానాలు, AAP 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) 1, కాంగ్రెస్ 1 సీట్లు గెలుచుకున్నాయి.
ఇదిలా ఉంటే గతంలో షాలిమార్ బాగ్-బి (Shalimar Bagh-B) కార్పొరేటర్ గా ఉన్న రేఖ గుప్తా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సీఎం కావడంతో.. ఈ స్థానంలో ఎవరు విజయం సాధిస్తారనే ఆసక్తి అందరిలో నెలకొనగా.. బీజేపీ అభ్యర్థి అనితా జైన్ 10 వేలకు పైగా ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఉప ఎన్నికల్లో 38.51% ఓటింగ్ నమోదైంది. ఇది 2022 లో జరిగిన సాధారణ MCD ఎన్నికల (50.47%) కంటే చాలా తక్కువ. ప్రస్తుతం MCD లో 115 స్థానాలతో ఉన్న బీజేపీ, ఈ ఉప ఎన్నికల్లో 12 స్థానాల్లో విజయం సాధించడం ద్వారా మెజారిటీ మార్కు అయిన 126ను దాటి కార్పొరేషన్‌పై పూర్తి పట్టు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఎవరూ ఊహించని విధంగా కేవలం 7 స్థానాల్లోనే విజయం సాధించింది.






