ఢిల్లీ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 7 |
ఢిల్లీ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

న్యూఢిల్లీ: గురువారం జరగాల్సిన ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. శుక్రవారం ఎన్నికల విషయమై సుప్రీంకోర్టులో విచారణ జరగనుండడంతో వాయిదా పడింది. ఎన్నికలు వాయిదా వేయాలని లెఫ్టినెంట్ గవర్నర్, ఇతరులు కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులకు ఓటు వేసేందుకు అనుమతివ్వొద్దని ఆప్ కోరింది. దీనిపై సీజేఐ స్పందిస్తూ నామినేటెడ్ సభ్యులకు ఓటు వేసే హక్కు లేదని చట్టం స్పష్టంగా చెబుతుందన్నారు.

ఇప్పటికే పలుమార్లు ఎన్నిక జరగాల్సిన ఉండగా, బీజేపీ-ఆప్ పరస్పర విమర్శలతో మూడు సార్లు వాయిదా పడింది. మరోవైపు సీఎం కేజ్రివాల్ ప్రతిపాదనతో ఈ నెల 16న ఎన్నిక నిర్వహించేందుకు ఎల్జీ వీకే సక్సేనా అంగీకరించారు. అయితే సుప్రీంకోర్టు జోక్యంతో మరోసారి వాయిదా పడింది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ చట్టం ప్రకారం నామినేటెడ్ సభ్యులు లేదా అల్డర్‌మెన్ కు హౌజ్ సమావేశాల్లో ఓటు వేసే హక్కు లేదు. గతేడాది డిసెంబర్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ 134 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 104 సీట్లు గెలుపొంది రెండోస్థానానికి పరిమితమైంది.

Also Read..

కర్ణాటకలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం



Next Story

Most Viewed