చట్టంలో లేని నిబంధనలతో విడాకులు.. జడ్జిని ట్రెయినింగ్‌కు పంపిన హైకోర్టు

by Phanindra |

చట్టంలో లేని నిబంధనలతో విడాకులు మంజూరు చేశాడో జడ్జి. ఈ విషయం తెలిసిన హైకోర్టు.. సదరు జడ్జిని వెంటనే రీ-ట్రెయినింగ్‌కు పంపింది.

చట్టంలో లేని నిబంధనలతో విడాకులు.. జడ్జిని ట్రెయినింగ్‌కు పంపిన హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యాంగంలో లేని చట్టం ఆధారంగా విడాకులు మంజూరు చేసిన ఒక ఫ్యామిలీ కోర్టు జడ్జిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆయన్ను మ్యాట్రిమోనియల్ చట్టంలో తప్పనిసరి రిఫ్రెషర్ ట్రైనింగ్‌కు వెంటనే పంపాలని ఆదేశించింది. ఈ ట్రైనింగ్ పూర్తిచేసే వరకు ఆయనకు ఎలాంటి కేసులు కేటాయించకూడదని తెలిపింది. మ్యాట్రిమొనీ చట్టంలో లేని నిబంధన ఆధారంగా, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఒక మహిళకు సదరు జడ్జి విడాకులు ఇచ్చినట్లు తెలిసిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది.

ఈ క్రమంలోనే సదరు జడ్జి ఇచ్చిన తీర్పుపై భర్త వేసిన పిటిషన్‌ను మరోసారి ఫ్యామిలీ కోర్టుకు రిఫర్ చేసింది. ఆ తీర్పు ఇవ్వడంలో ప్రత్యేక పెళ్లి చట్టం (ఎస్ఎంఏ)లో లేని నిబంధనల ఆధారంగా ఈ విడాకులు ఇచ్చినట్లు జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్‌తో కూడిన హైకోర్టు న్యాయస్థానం పేర్కొంది. అంతేకాకుండా హిందూ మ్యారేరజ్ యాక్ట్ (హెచ్‌ఎంఏ) కింద నమోదైన కేసులో ఎస్ఎంఏ నిబంధనలు అమలు చేశారని గుర్తించింది.

Next Story