- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం.. సోనియా, రాహుల్ గాధీకి షాక్
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీలకు బిగ్ తగిలింది.

దిశ, డైనమిక్ బ్యూరో: నేషనల్ హెరాల్డ్ (National Herald Case) మనీ లాండరింగ్ కేసులో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి (పిసి యాక్ట్) విశాల్ గోగ్నే.. ఈ కేసుతో సంబంధం ఉన్న సామ్ పిట్రోడా, సుమన్ దూబే, సునీల్ భండారి, మెస్సర్స్ యంగ్ ఇండియా, మెస్సర్స్ డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ లకు ఇవాళ నోటీసులు జారీ చేశారు. గత నెలలో ఇదే కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అందించిన ఛార్జిషీట్‌లో సరైన పత్రాలు లేవని సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి నోటీసులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించగా ఇవాళ జరిగిన విచారణలో చార్జిషీట్ లోని లోపాలు పరిష్కరిచబడ్డాయని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీ వరకు వాయిదా వేసింది.






