Breaking : పార్లమెంట్ సెక్యూరిటీ బ్రీచ్ కేసు.. నిందితులకు బెయిల్ మంజూరు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-02 06:37:48  IST  )

2023 డిసెంబర్ 13న పార్లమెంట్ వద్ద భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన నిందితులకు ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.

Breaking : పార్లమెంట్ సెక్యూరిటీ బ్రీచ్ కేసు.. నిందితులకు బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్‌డెస్క్: 2023 డిసెంబర్ 13న పార్లమెంట్ వద్ద భద్రతా ఉల్లంఘనకు (Parliament Security Breach Case) పాల్పడిన నిందితులకు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) బుధవారం బెయిల్ మంజూరు చేసింది. నిందితులు నీలం ఆజాద్, మహేశ్ కుమావత్‌లకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన కోర్టు.. రూ.50 వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. నిందితులు సమీపంలోని స్టేషన్లలో సంతకాలు చేయాలని, దిల్లీ విడిచి వెళ్లకూడదని షరతు విధించింది. కేసు విషయమై సోషల్‌ మీడియాలోనూ పోస్టులు పెట్టొద్దని న్యాయస్థానం సూచించింది. గతంలో తమ బెయిల్ దరఖాస్తును తిరస్కరించిన దిగువ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ నిందితులు హైకోర్టులో బెయిల్ కు అప్పీల్ చేయగా.. ఆమోదం లభించింది.

2001 పార్లమెంట్ పై దాడి వార్షికోత్సవం సందర్భంగా పాత పార్లమెంట్ భవనంలో భద్రతా ఉల్లంఘన జరిగింది. దాదాపు అదే సమయంలో అమోల్ షిండే, నీలం ఆజాద్ లు పార్లమెంటు ప్రాంగణం వెలుపల తనషాహి నహీ చలేగి అని అరుస్తూ.. డబ్బాల నుంచి కలర్ ఎయిర్ ను చల్లారు. ఈ కేసులో నలుగురు నిందితులతో పాటు.. లలిత్ ఝా, మహేష్ కుమావత్ లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరినీ పోలీసులు కస్టడీలో విచారిస్తున్నారు.

Next Story