WFHపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లాక్ డౌన్‌కు తొలి అడుగు పడిందా?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-14 12:24:20  IST  )

ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

WFHపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లాక్ డౌన్‌కు తొలి అడుగు పడిందా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ఇంధన పొదుపును పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుకు ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. సీఎం రేఖాగుప్తా ఈ మేరకు తీసుకున్న నిర్ణయాలను గురువారం ప్రకటించారు. ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో వారానికి రెండ్రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిబంధన రేపటి నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. అలాగే ఇంధనాన్ని పొదుపుచేసుకున్న చర్యల్లో భాగంగా ప్రతీ సోమవారం.. మండే మెట్రో నియమాన్ని పాటించాలని సూచించారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులంతా తమ సొంత వాహనాలను వదిలి తప్పనిసరిగా మెట్రోలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. సామాన్య ప్రజలు కూడా వారానికి ఒక రోజు నో వెహికల్ డే పాటించాలని విజ్ఞప్తి చేసింది. కొత్తవాహనాల కొనుగోళ్లపై ఆరునెలల వరకూ నిషేధం విధించింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును నిలిపివేశారు. ఇక ఏడాది కాలంపాటు మంత్రులు, అధికారులు ఎవరూ విదేశీ పర్యటనలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశించింది.

పొదుపు చర్యల్లో భాగంగా.. అందరికీ ఆదర్శంగా నిలిచేలా సీఎం రేఖా గుప్తా తన అధికారిక కాన్వాయ్ ను 60 శాతం మేర తగ్గించుకున్నారు. గతంలో ఉన్న వాహనాల సంఖ్యను నాలుగింటికి పరిమితం చేశారు. వాటిలో కూడా రెండు ఈవీ వెహికల్స్ ఉండటం విశేషం. కాలుష్య రహిత, సుస్థిరమైన ప్రయాణమే లక్ష్యంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక ప్రయాణ ఇబ్బందుల దృష్ట్యా ఉద్యోగుల రవాణా ఖర్చులను (Transport Allowance) 10 శాతం పెంచుతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆఫీసుల్లో ఏసీ టెంపరేచర్ ను 24-26 డిగ్రీల మధ్యే ఉంచాలని.. అనవసర విద్యుత్ వాడకాన్ని అరికట్టేందుకు మాస్టర్ స్విచ్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా.. మోదీ పిలుపుమేరకు పొదుపు చర్యల్లో భాగంగా తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తోంటే లాక్ డౌన్ కు తొలి అడుగు పడిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంధనం పొదుపు దిశగా తెలంగాణ.. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ తగ్గింపు

Next Story