- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంత జీతం వచ్చినా సరిపోవట్లేదా?.. ఒక్కసారి ఈ ప్లాన్ చూడండి!
ప్రస్తుత రోజుల్లో మెట్రో నగరాల్లో జీవన వ్యయం (లివింగ్ కాస్ట్) విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ లాంటి నగరంలో నెలకు వేలల్లో జీతం వచ్చినా సరిపోవడం లేదని చాలా మంది బాధపడుతుంటారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో మెట్రో నగరాల్లో జీవన వ్యయం (లివింగ్ కాస్ట్) విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ లాంటి నగరంలో నెలకు వేలల్లో జీతం వచ్చినా సరిపోవడం లేదని చాలా మంది బాధపడుతుంటారు. అయితే, ఢిల్లీలో నివసిస్తున్న ఒక 28 ఏళ్ల ప్రభుత్వ మహిళా అధికారిణి మాత్రం తనకు నెలకు రూ. 90,000 చేతికి వస్తున్నప్పటికీ, కేవలం రూ. 25,000 తోనే తన నెలవారీ ఖర్చులను ఎంతో పొదుపుగా వెళ్లదీస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి బడ్జెట్ వివరాలను ఆమె సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న కృతిక బడ్జెట్ ప్లాన్..
2022 SSC కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ప్రస్తుతం ఢిల్లీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASC)గా పనిచేస్తున్న 'కృతిక' అనే యువతి తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఈ వివరాలను వెల్లడించింది. లెవెల్ 7 ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆమె, విలాసాలకు దూరంగా ఉంటూ చాలా క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని ఎలా అలవాటు చేసుకుందో వివరించింది.
ఆమె నెలవారీ బడ్జెట్ విభజన ఇలా ఉంది..
ఇంటి అద్దె (Rent): ఒక ఫ్లాట్‌మేట్‌తో కలిసి 2BHK ఫ్లాట్లో షేరింగ్లో ఉంటోంది. అందువల్ల ఆమె వాటా కింద నెలకు రూ. 11,500 అద్దె చెల్లిస్తోంది. వంటమనిషికి నెలకు రూ. 5,000 ఇస్తుండగా, అందులో కృతిక వాటా రూ.2,500. ఇక కిరాణా సామాగ్రి విషయానికొస్తే.. ఆన్లైన్ డెలివరీ యాప్స్ (జెప్టో బ్లింకిట్) ద్వారా నెలకు దాదాపు రూ. 4,000 నుండి రూ. 5,000 వరకు ఖర్చు అవుతుంది. రవాణా ఖర్చులు (Commuting): ఖరీదైన క్యాబ్లు లేదా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్‌పై ఆధారపడకుండా, ఆమె సొంత స్కూటీని వాడుతోంది. దీనికి పెట్రోల్ ఖర్చు నెలకు కేవలం రూ. 1,500 మాత్రమే. షాపింగ్ కోసం రూ.3,000 నుండి రూ. 4,000 ఖర్చు చేస్తుంది. బయట తినడానికి లేదా ఆర్డర్ చేయడానికి నెలకు గరిష్టంగా రూ.2,000 మాత్రమే కేటాయిస్తుంది. ఇంట్లో వండిన ఆహారానికీ ఆమె ప్రాధాన్యత ఇస్తుండటం విశేషం. ఓటీటీ వంటి ప్లాట్ఫారమ్ కోసం ఆమె రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. తన స్నేహితులు, సోదరి అకౌంట్లను షేర్ చేసుకోవడం ద్వారా ఈ ఖర్చును పూర్తిగా ఆదా చేస్తోంది.
ఒక్కసారి పెట్టే ఖర్చులు వేరు..
ఈ లెక్కలన్నీ కలిపితే నెలకు దాదాపు రూ. 25,000 అవుతుందని కృతిక పేర్కొంది. ఢిల్లీ లాంటి నగరంలో ఇంత తక్కువ ఖర్చు ఎలా సాధ్యం అని మీరు అనుకోవచ్చు. గత నెలలో నేను ఒక ట్రిప్‌కు వెళ్లాను, అలాగే ఒక మంచి మ్యాట్రిస్ (పరుపు) కొనుగోలు చేశాను. కానీ, వాటిని నేను నెలవారీ బడ్జెట్లో కలపలేదు. ఎందుకంటే అవి ఎప్పుడో ఒకసారి పెట్టే ఖర్చులు మాత్రమే" అని ఆమె స్పష్టం చేసింది. నెలకు రూ.90 వేల జీతం సంపాదిస్తూ కూడా, అనవసరపు ఖర్చులకు చెక్ పెడుతూ దాదాపు రూ. 65,000 వరకు ఆదా చేస్తున్న కృతిక లైఫ్ స్టైల్‌ను నెటిజన్లు ఎంతో అభినందిస్తున్నారు. మధ్యతరగతి యువతకు, డేద్యోగులకు ఆమె ఒక చక్కటి బడ్జెట్ రోల్ మోడల్ అని కామెంట్లు పెడుతున్నారు.






