Delhi: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. పార్లమెంట్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతల యత్నం

by Shiva |   ( Updated:2025-02-06 12:18:25.0  )
Delhi: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. పార్లమెంట్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతల యత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆమెరికా (America) భారత (India) వలసదారులను దారుణంగా హింసించిందంటూ యూత్ కాంగ్రెస్ (Youth Congress) నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ పార్టీ కార్యకర్తలు పార్లమెంట్‌ (Parliament)ను ముట్టడించేందకు యత్నించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అడ్డుకోకుండా మౌనంగా ఉన్నారంటూ యూత్ కాంగ్రెస్ (Youth Congress) నేతలు ఆరోపించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం (Central Government)కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు (Delhi Police) యూత్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి అక్కడి నుంచి స్టేషన్‌కు తరలించారు.

కాగా, అమెరికా(America)లో అక్రమంగా నివసిస్తున్న (Indian immigrants) భారతీయులను అగ్రరాజ్యం ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపిన నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు నిరసన చేపట్టాయి. భారతీయులను అమెరికా బహిష్కరించడంపై ఉభయ సభల్లో సభలో చర్చకు పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పార్లమెంట్ ఆవరణలో విపక్ష నేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), మల్లిఖార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi), అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) చేతులకు బేడీలు వేసుకుని నిరసన తెలిపారు. భారతీయులను ఇంత దారుణంగా పంపించడంపై భారత ప్రభుత్వం మౌనంగా ఉండటం ఏంటని విపక్ష నేతలు ప్రశ్నించారు. మరోవైపు ఈ ధర్నాలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు.

Next Story

Most Viewed