Delhi Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ.. తొలి గంటలో పోలింగ్ శాతం ఇలా!

by Kema Shiva Kumar |

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.

Delhi Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ.. తొలి గంటలో పోలింగ్ శాతం ఇలా!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu), కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ (Delhi CM Atishi), కేంద్ర మంత్రి జైశంకర్‌ (Union Minister Jayashankar) సహా పలువురు ప్రముఖులు తొలి గంటలోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాగా 9 గంటల వరకు 8.10 శాతం పోలింగ్‌ నమోదైనట్లుగా అధికారులు ప్రకటన విడుదల చేశారు.

కాగా, పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఢిల్లీ (Delhi)లోని మొత్తం 70 స్థానాలకు గానూ 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 13,766 పోలింగ్‌ కేంద్రాల్లో 1.56 కోట్ల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుబోతున్నారు. అదేవిధంగా అధికారులు ఇప్పటికే 3 వేలకు పైగా సమస్యాత్మక పోలింగ్ బూత్‌లను ఐడెంటిఫై చేశారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుకోకుండా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు ఎన్నికల విధుల్లో 35 వేల మంది పోలీసులు పాల్గొన్నట్లుగా ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల పోరులో అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP), బీజేపీ (BJP), కాంగ్రెస్‌ (Congress) మధ్య పోరు నువ్వా.. నేనా అన్నట్లుగా కొనసాగనుంది. దివ్యాంగులు, వృద్ధులకు అధికారులు హోమ్‌ ఓటింగ్‌ సౌకర్యాన్ని కల్పించారు. అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈనెల 8న కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.

Next Story