- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Delhi Elections: అద్దె ఇళ్లలో ఉండే వారికి ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన హామీ
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) జోరు కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రధాన పార్టీలు నామినేషన్లు, ప్రచారాలతో హాడావిడి చేస్తున్నారు. ఎన్నికలలో గెలిచేందుకు పార్టీలు తమ తమ హామీలతో మేనిఫోస్టోలను(Menifesto) విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆప్(AAP) ఇప్పటికే తమ మేనిఫెస్టోను విడుదల చేయగా.. ఇవాళ మరో హామీతో ముందుకు వచ్చింది. అద్దె ఇంట్లో ఉండే వారి ఓట్ల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యేక హామీని తీసుకొచ్చింది. ఈ మేరకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) సంచటన ప్రకటన చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఢిల్లీలో అద్దె ఇళ్లల్లో ఉండేవారికి ఉచిత విద్యుత్(Free Electricity), నీరు(Free Water) అందిస్తామని హామీ ఇచ్చారు. పూర్వాంచల్‌కు చెందిన కౌలుదారులకు కూడా ఈ పథకాలు వర్తింపజేస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. కాగా ఢిల్లీలో అద్దె ఇళ్లలో ఉండే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ హామీతో అద్దె ఇళ్లలో ఉండే వారి ఓట్లు ఆప్‌కు పడే అవకాశం ఉందని, దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు బ్యాంకు మరింత పెరిగే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.






