Delhi Election Results: ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ.. సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన ట్వీట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-09 11:30:08  IST  )

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) బీజేపీ టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది.

Delhi Election Results: ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ.. సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) బీజేపీ టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది. ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly)లో మొత్తం 70 స్థానాలు ఉండగా.. బీజేపీ (BJP) అభ్యర్థులు 45 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతున్నారు. అదేవిధంగా ఆమ్‌ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) 25 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ (Congress Party) అభ్యర్థులు ఎక్కడా లీడ్‌లో కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఇండియా కూటమి (India Alliance) భాగస్వామి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (National Conference Party) అధ్యక్షుడు, జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (CM Omar Abdullah) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్)‌లో ‘అవుర్ లడో ఆపస్ మే’ అంటూ సంచలన ట్వీట్ చేశారు. ఇండియా కూటమి అని పేరు పెట్టుకుని మనం.. మనం కొట్లాడితే ఫలితాలు ఇలానే వస్తాయి. ఇంకా కొట్లాడుకోండి, ఇంకా దారుణ ఫలితాలు చూస్తారు అంటూ రామాయణం వీడియోను షేర్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) ఫలితాలు వెలువడుతోన్న వేళ ప్రస్తుతం ఒమర్ అబ్దుల్లా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story