- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Herald Case: సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు పంపడానికి నిరాకరించిన ఢిల్లీ కోర్టు
నోటీసులు ఇవ్వడానికి ముందు, ఈడీ ఛార్జిషీట్‌లో ఏదైనా లోపం ఉందా అనే విషయాన్ని కోర్టు చూడాల్సి ఉందన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ హెరాల్డ్‌తో ముడిపడి ఉన్న ఆస్తుల స్వాధీనానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ కీలక నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు జారీ చేయడానికి ఢిల్లీ కోర్టు శుక్రవారం నిరాకరించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అందించిన ఛార్జిషీట్‌లో సరైన పత్రాలు లేవని, వాటిని దాఖలు చేయాలని కోర్టు పేర్కొంది. ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నే.. నోటీసులు ఇవ్వడానికి ముందు, ఈడీ ఛార్జిషీట్‌లో ఏదైనా లోపం ఉందా అనే విషయాన్ని కోర్టు చూడాల్సి ఉందన్నారు. ఛార్జిషీట్‌లో కొన్ని పత్రాలు లేవు. ఆ పత్రాలను దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. ఆ తర్వాతే, నోటీసులు జారీ చేయడంపై కోర్టు నిర్ణయం తీసుకుంటున్నారు. కొత్త పీఎంఎల్ఏ చట్టంలోని నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా ఛార్జీషీట్‌ను పరిగణలోకి తీసుకోలేం. విచారణకు వచ్చేలా వారికి నోటీసులివ్వాలని కోర్టు ఈడీకి ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించి తాము ఎలాంటి విషయాన్ని దాచడంలేదు. కేసు విచారణ నిమిత్తం వారి అభిప్రాయాన్ని చెప్పేందుకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు అవకాశం ఇస్తున్నట్టు ఈడీ అధికారులు కోర్టుకు తెలియజేశారు. అయితే, నిందితులకు నోటీసులు జారీ చేయడంపై నిర్ణయం తీసుకునే ముందు ఛార్జిషీట్‌లోని కొన్ని లోపాలను పరిష్కరించాలని, మరిన్ని సంబంధిత పత్రాలను సమర్పించాలని కోర్టు పేర్కొంది. అనంతరం ఈ కేసు విచారణను మే 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ, కాంగ్రెస్ కీలక నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ప్రధాన నిందితులుగా అభియోగాలు మోపింది.






