- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NIA: తహవ్వూర్ రానా వాయిస్, చేతిరాత శాంపిల్స్ నమోదుకు ఢిల్లీ కోర్టు అనుమతి
ఏజన్సీ దాఖలు చేసిన దరఖాస్తుపై ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి.

దిశ, నేషనల్ బ్యూరో: 26/11 ముంబై ఉగ్రవాద దాడి నిందితుడు తహవ్వూర్ రాణా వాయిస్, చేతిరాత శాంపిల్స్‌ను సేకరించడానికి ఢిల్లీ కోర్టు ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కి అనుమతి ఇచ్చింది. గతవారమే రాణా కస్టడీని 12 రోజుల పాటు పొడిగించిన ఎన్‌ఐఎ న్యాయమూర్తి చందర్‌జిత్ సింగ్.. ఏజన్సీ దాఖలు చేసిన దరఖాస్తుపై ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. తహవ్వూర్ రాణా వాయిస్ సాంపిల్స్‌ను సేకరించడం ద్వారా ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో ఇతరులతో అతను మాట్లాడినట్టు సందేహిస్తున్న కాల్ రికార్డులను ధ్రువీకరించే అవకాశం ఉంటుంది. కాగా, ఏప్రిల్ 10న రాణాను భారత్‌కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నేరుగా ఎన్‌ఐఏ కోర్టులో రాణాను హాజరుపరిచి విచారించారు. ముంబై ఉగ్రవాద దాడి కుట్రకు ప్రధాన సూత్రధారి డెవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీకి తహవ్వూర్ రాణా సన్నిహితుడు. ఈ కేసులో డేవిడ్ హెడ్లీకి సహకరించిన ఓ రహస్య వ్యక్తిని కూడా అధికారులు విచారిస్తున్నట్టు సమాచారం. 2008, నవంబర్ 26న పది మంది పాకిస్తాన్ ఉగ్రవాదులౌ సముద్ర మార్గంలో భారత్‌లో చొరబడ్డారు. ముంబైలో చొరబడిన తర్వాత రైల్వే స్టేషన్, రెండు లగ్జరీ హోటళ్లు సహా పలుచోట్ల విధ్వంసం సృష్టించారు.






