- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో కాంగ్రెస్‌కు షాక్.. ఉపాధ్యక్షుడు, కౌన్సిలర్లు జంప్
ఇప్పటికే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో భంగపాటుకు గురైన కాంగ్రెస్‌కు మరో షాక్ ఎదురైంది.

X
న్యూఢిల్లీ: ఇప్పటికే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో భంగపాటుకు గురైన కాంగ్రెస్‌కు మరో షాక్ ఎదురైంది. మూడు రోజుల క్రితం వెలువడిన ఫలితాల్లో గెలుపొందిన ఇద్దరు కౌన్సిలర్లతో సహా పార్టీ ఉపాధ్యక్షుడు శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ మేరకు ఆప్ నేత దుర్గేష్ పతాక్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపాధ్యక్షుడు అలీ మెహదీ, కౌన్సిలర్లు సబిలా బేగం, నజియా ఖాటూన్‌లు ఆప్ కండువా కప్పుకున్నారు. కేజ్రీవాల్ చేసిన అభివృద్దిని మెచ్చి పార్టీలో చేరారని దుర్గేష్ పతాక్ తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో 9 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ తాజా మార్పిడితో 7 స్థానాలకు పడిపోయింది. కాగా, మున్సిపల్ ఎన్నికల్లో ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు. బుధవారం వెలువడిన ఢిల్లీ మున్సిపల్ ఫలితాల్లో కేజ్రీవాల్ పార్టీ 134, బీజేపీ 104 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Next Story






