ఈడీ ఛార్జ్ షీట్ పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సెటైర్లు

by Dishafeatures2 |
ఈడీ ఛార్జ్ షీట్ పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తాజాగా రెండో ఛార్జీ షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జీ షీట్ లో ఢిల్లీ సీఎం పాత్ర ఉందంటూ ఈడీ అభియోగాలు మోపింది. ఈడీ తనపై మోపిన అభియోగాలపై ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అవినీతికి వ్యతిరేకంగా ఈడీ పని చేయడం లేదంటూ విమర్శించారు. ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చడానికే ఈడీ పని చేస్తోందని సెటైర్లు వేశారు. ఈడీ 5 వేలకు పైగా ఛార్జీ షీట్లు దాఖలు చేసిందని, ఇప్పటి వరకు ఎంత మందికి శిక్ష పడిందని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధంలేదని, ఈడీ ఛార్జ్ షీట్ మొత్తం కల్పితమని ఢిల్లీ సీఎం కొట్టిపారేశారు.

ఇక తాజాగా ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉన్నట్లు పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆప్ నేత విజయ్ నాయర్.. అరవింద్ కేజ్రీవాల్, ఇండో స్పిరిట్స్ అధినేత సమీర్ మహేంద్రుతో తన ఫోన్ నుంచి వీడియో కాల్ లో మాట్లాడినట్లు తెలిపింది. ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీ లైసెన్సుల కోసం సౌత్ గ్రూప్ నుంచి విజయ్ నాయర్ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తరఫున రూ.100 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు ఈడీ ఆరోపించింది. ఈ డబ్బును గోవా ఎన్నికల కోసం ఆప్ ఉపయోగించినట్లు తెలిపింది. ఇక ఈడీ పేర్కొన్న సౌత్ గ్రూప్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరబిందో ఫార్మాకు చెందిన శరత్ రెడ్డి ఉన్నట్లు ఈడీ పేర్కొంది.


Next Story

Most Viewed