- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Delhi CM: ఢిల్లీ ముఖ్యమంత్రికి అధికారిక నివాసం కేటాయింపు
ఢిల్లీ (Delhi) ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta)కు ఎట్టకేలకు అధికారిక నివాసం దొరికింది. సీఎంగా బాధ్యతలు చేపట్టి దాదాపు వంద రోజుల తర్వాత ఆమెకు కొత్త బంగ్లాను కేటాయించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ (Delhi) ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta)కు ఎట్టకేలకు అధికారిక నివాసం దొరికింది. సీఎంగా బాధ్యతలు చేపట్టి దాదాపు వంద రోజుల తర్వాత ఆమెకు కొత్త బంగ్లాను కేటాయించారు. రేఖా గుప్తా నియోజకవర్గానికి దగ్గరగా ఉన్న సివిల్ లైన్స్ లోని రాజ్ నివాస్ మార్గంలోని బంగ్లాను అధికారిక నివాసంగా గుర్తించారు. సీఎం ప్రస్తుతం షాలిమార్ బాగ్‌లోని తన నివాసం నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో అక్కడికి వచ్చే సందర్శకులు, వీఐపీలు, సీనియర్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక సచివాలయానికి వెళ్లేందుకు రోజూ 25 కిలోమీటర్లు ఆమె ప్రయాణించాల్సి వస్తోంది. ఆమె నియోజకవర్గానికి దగ్గరగా ఉన్న సివిల్ లైన్స్ లేదా లుటియెన్స్ ప్రాంతాల్లో సీఎంకు బంగ్లా కేటాయించేందుకు అధికారులు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కాగా.. సివిల్ లైన్స్ లోని ప్రాంతంల్ చివరకు బంగ్లా దొరికింది.
మంత్రులకు కూడా..
సీఎంకే కాకుండా డిప్యూటీ స్పీకర్ మోహన్ సింగ్ బిష్ట్‌కు, సాంఘిక సంక్షేమ మంత్రి రవీంద్ర ఇంద్రరాజ్‌లకు కూడా ఇక్కడే బంగ్లాలు కేటాయించారు. గతంలో ఆప్ నేత మనీశ్ సిసోడియా ఉన్న మధుర రోడ్డులోని ఇంటిని పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ కు కేటాయించారు. బీజేపీ ప్రభుత్వంలోని కొత్త ఎంపీలందరికీ ఇప్పటికే నివాసాలను కేటాయించారు. కాగా.. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా పనిచేసిన సమయంలో సివిల్ లైన్స్‌లో 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ బంగ్లాను అధికారిక నివాసంగా వాడారు. ఆ బంగ్లాను ‘శీష్ మహల్ (అద్దాల మేడ) (Sheesh Mahal)’గా బీజేపీ పేర్కొంది. అందులోకి వెళ్లేందుకు బీజేపీ సీఎం విముఖత వ్యక్తం చేశారు.






