ఢిల్లీ బ్లాస్ట్.. ప్రత్యక్ష సాక్షులు ఏమ్మన్నారంటే?

by Muthe.Rajitha |

దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ బ్లాస్ట్.. ప్రత్యక్ష సాక్షులు ఏమ్మన్నారంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. కాగా పేలుడు ధాటికి 9 మంది చనిపోగా.. 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ ఓ కారు పేలి పోగా.. చుట్టూ ఉన్న వాహనాలు కూడా కాలిపోయాయి. అయితే ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. అత్యంత భారీగా పేలుడు శబ్దం వినిపించడంతో.. మేమంతా పరుగెత్తుకుంటూ వెళ్ళమని తెలిపారు.

బ్లాస్ట్ జరిగిన చోట ఛిద్రమైన శరీర భాగాలు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయని అన్నారు. వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యి, పదుల సంఖ్యలో వాహనాలు మంటల్లో కాలిపోతున్నాయని తెలిపారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదని, భారీ శబ్దం ధాటికి చుట్టుపక్కల ఉన్న భవనాల కిటికీలు కంపించి పోయాయని వారు వెల్లడించారు.

Next Story