ఢిల్లీ బ్లాస్ట్.. ఎర్రకోట వద్ద పేలుడు ఘటన వెలుగులోకి సీసీటీవీ దృశ్యాలు

by Ramesh Naini |   (  Updated:2025-11-12 07:03:49  IST  )

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు (Delhi blast) ఘటనపై కొత్త వివరాలు బయటకు వచ్చాయి.

ఢిల్లీ బ్లాస్ట్.. ఎర్రకోట వద్ద పేలుడు ఘటన వెలుగులోకి సీసీటీవీ దృశ్యాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలోని (Red Fort) ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు (Delhi blast) ఘటనపై కొత్త వివరాలు బయటకు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన (CCTV footage) సీసీటీవీ చిత్రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట క్రాసింగ్ వద్ద అమర్చిన భద్రతా కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. జాతీయ మీడియా విడుదల చేసిన వీడియోలో ట్రాఫిక్ నేపథ్యంలో సిగ్నల్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్న సమయంలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పేలుడు సంభవించిన వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు పరుగులు తీశారు. సోమవారం సాయంత్రం 6.52 గంటల సమయంలో ఈ పేలుడు జరిగినట్లు అధికారులు ఇది వరకే వెల్లడించారు. ఎర్రకోట సమీపంలో సిగ్నల్ వద్ద ఓ కారు ఆగిన వెంటనే ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ పేలుడు కారణంగా పరిసర ప్రాంతంలోని వాహనాలు ధ్వంసం అయ్యాయని అధికారులు చెబుతున్నారు.

కాగా, ఢిల్లీ ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద సోమవారం (నవంబర్ 10) జరిగిన కారు బాంబు బ్లాస్ట్ లో 12 మంది మరణించగా.. పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. పేలుడు ఘటన తర్వాత ఎర్రకోట సమీపంలో రోడ్లు, చాందినీ చౌక్ లో షాపులను మూసివేయించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. కేసు దర్యాప్తును కేంద్ర హోంశాఖ NIAకు అప్పగించింది. దర్యాప్తు జరుపుతున్న ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. కారును నడిపిన వ్యక్తి డాక్టర్‌ ఉమర్‌ నబీ జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాకు చెందినవాడిగా అధికారులు తేల్చారు. ఆ డాక్టర్ ఉమర్ నబీ ఫరీదాబాద్‌ పేలుడు పదార్థాలతో సంబంధం ఉన్న నేపథ్యంలో పోలీసులకు పట్టుబడే అవకాశం ఉందని ఆత్మాహుతికి పాల్పడ్డాడా..? లేదా అనుకోకుండా పేలాయా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీటీవీ ఫుటేజీల విశ్లేషణతో పాటు, పేలుడు పదార్థాల మూలం కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వీడియో ఇదే..

Next Story