- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi: ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి.. కేజ్రీవాల్ పీఎస్‌కు మహిళా కమిషన్ నోటీసులు
by Kema Shiva Kumar |
రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై జరిగిన దాడికి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై జరిగిన దాడికి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీ బిభవ్ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్ గురువారం నోటీసులు పంపింది. ఈ మేరకు తమ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరుకావాలని పేర్కొంది. కాగా, సీఎం పర్సనల్ సెక్రటరీ తనపై దాడి చేశాడంటూ స్వాతి మలివాల్ ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అదే పోస్టును పోస్ట్‌ను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ సీఎం కార్యాలయానికి నోటీసులు పంపింది. రేపు ఉదయం 11 గంటలలోపు కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని అందులో పేర్కొంది. ఇక వేళ శుక్రవారం కమిషన్ ముందు హాజరుకాకపోతే బిభవ్ కుమార్‌పై తదుపరి చర్యలు తీసుకుంటామని జాతీయ మహిళా కమిషన్ హెచ్చరించింది.
Next Story






