- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kejriwal: ఆప్ చీఫ్ కేజ్రీవాల్ హత్యకు కుట్ర..!
ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) సంచలన వ్యాఖ్యలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను చంపేందుకు ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) సంచలన వ్యాఖ్యలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను చంపేందుకు ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. కేజ్రీవాల్ కు పంజాబ్ పోలీసులు కల్పించిన భద్రతను పునరుద్ధరించాలని ఎన్నికల కమిషన్ ను కోరినట్లు పేర్కొంది. కేజ్రీవాల్ భద్రతకు సంబంధించి ఢిల్లీ సీఎం ఆతిషీ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌లు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కేజ్రీవాల్ పై ఢిల్లీ పోలీసులు, కేంద్రం కుట్ర పన్నుతోందని అన్నారు. ఆయన్ని చంపేందుకు ఒకదాని వెనుక మరో ప్రయత్నం చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. గతంలో కేజ్రీవాల్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని దర్యాప్తులో తేలినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తుచేశఆరు. కేజ్రీవాల్‌పై జరుగుతున్న దాడులపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఢిల్లీ పోలీసులు దృష్టి సారించడం లేదన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే వారంతా ఇలా ప్రవర్తిస్తున్నారని నిప్పులు చెరిగారు.
బీజేపీ డర్టీ పాలిటిక్స్..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ డర్టీ పాలిటిక్స్ చేస్తుందని.. అందుకే, ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌కు ముప్పు వాటిల్లేలా ఆయనకు భద్రతను తొలగించారని అతిషీ మండిపడ్డారు. ఈ సందర్భంగానే ఫిబ్రవరి 5న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) తమ పార్టీకి క్షేత్రస్థాయిలో సమాన అవకాశాలు కల్పించాలని ఎన్నికల సంఘాన్ని (Election Commission) కోరినట్లు తెలిపారు. అంతేకాకుండా కేజ్రీవాల్‌పై దాడులపై దర్యాప్తుతోపాటు ఆయనకు పంజాబ్ పోలీసులు కల్పించిన భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అయితే, ఆప్ చేసిన ఆరోపణలపై బీజేపీ నుంచి గానీ, ఢిల్లీ పోలీసుల నుంచి గానీ ఎటువంటి స్పందన రాలేదు.






