Best Airport: ప్రపంచంలోని టాప్ 100 విమానాశ్రయాల్లో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్

by S Gopi |

భారత్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 32వ ర్యాంకును సాధించింది

Best Airport: ప్రపంచంలోని టాప్ 100 విమానాశ్రయాల్లో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే ఉత్తమ ఎయిర్‌పోర్ట్‌గా సింగపూర్‌కు చెందిన చాంగీ వరుసగా 13వ సారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తజాగా అంతర్జాతీయ విమానయాన సంథలకు రేటింగ్ ఇచ్చే సంస్థ స్కైట్రాక్స్ టాప్-100 ఉత్తమ విమానాశ్రయాల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 32వ ర్యాంకును సాధించింది. లగ్జరీ, సౌకౌర్యాలు, ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి పలు కీలక అంశాల ఆధారంగా స్కైట్రాక్స్ ఈ జాబితాను రూపొందిస్తుంది. ఆసక్తికరంగా ఈ జాబితాలో భారత్‌కు చెందిన నాలుగు విమానాశ్రయాలు చోటు దక్కించుకున్నాయి. ఢిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయం 32వ ర్యాంకుతో భారత్‌లో బెస్ట్ ఎయిర్‌పొర్ట్‌గా నిలిచింది. ఈ ఎయిర్‌పోర్ట్ అత్యంత రద్దీగా ఉండటమే కాకుండా ఆధునిక టెర్మినల్స్, ఆర్ట్ డిస్‌ప్లే, సమర్థవంతమైన ఇమ్మిగ్రేషన్, మెరుగైన కనెక్టివిటీతో జాబితాలో నిలిచింది. దీని తర్వాత బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకృతి స్పూర్తితో కూడిన కొత్త టెర్మినల్, పచ్చదనం, కళల ప్రదర్శనతో 48వ స్థానంలో ఉంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 56వ స్థానంలో నిలవగా, శుభ్రత, స్నేహపూర్వక సిబ్బంది, మెరుగైన ప్రయాణీకుల అనుభవం అందించడంలో ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయం అద్భుతమైన ఆర్కిటెక్చర్, ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌లకు ప్రసిద్ధి కావడం ద్వారా 73వ స్థానాన్ని సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో సింగపూర్ తర్వాత దోహా హమద్, టోక్యో హనేడా, సియోల్‌లోని ఇంచియాన్, టోక్యో నరిటా విమానాశ్రయాలు టాప్-5లో ఉన్నాయి.

Next Story