- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Defence: భారత డిఫెన్స్ వెబ్‌సైట్లు హ్యాక్.. పాకిస్తాన్ సైబర్ గ్రూప్ పనేనా?
పహెల్గాం ఉగ్ర దాడి తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ హ్యాకర్లు భారత డిఫెన్స్ వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం (Pahelgam) ఉగ్ర దాడి తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ హ్యాకర్లు భారత డిఫెన్స్ వెబ్‌సైట్ (Difence websites) లను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. సైబర్ దాడులు చేపట్టి రక్షణ సిబ్బందికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని, వారి లాగిన్ ఐడీలను కూడా చోరీ చేసి ఉండొచ్చని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. ‘పాకిస్థాన్ సైబర్ ఫోర్స్‌కు చెందిన హ్యాకర్లు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, మనోహర్ పారికర్ ఇన్స్‌ట్యిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ కు చెందిన డేటాను చోరీ చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ వెబ్‌సైట్‌ను కూడా ఈ బృందం ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది. హ్యాకింగ్ ప్రయత్నం వల్ల సంభవించే నష్టాన్ని ఎదుర్కోవడానికి ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ వెబ్‌సైట్‌ను పూర్తి ఆడిట్ కోసం ఆఫ్‌లైన్‌లో ఉంచాం’ అని పేర్కొన్నాయి.
పాకిస్తాన్‌తో సంబంధం సైబర్ నిందితులు చేసే దాడులను గుర్తించడానికి సైబర్ భద్రతా నిపుణులు సైబర్‌స్పేస్‌ను చురుకుగా పర్యవేక్షిస్తున్నారని, మరిన్ని చొరబాటు ప్రయత్నాల నుంచి రక్షణ కల్పించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపాయి. మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ వెబ్‌సైట్‌లోని 1,600 మంది వినియోగదారుల డేటాను హ్యాక్ చేసినట్టు సమాచారం. అయితే దీనిని భారత ప్రభుత్వం అధికారికంగా ద్రువీకరించలేదు.






