- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Defence: భారత సైన్యం మరింత పటిష్టం.. టీ-72 ట్యాంకుల కోసం హెచ్‌వీఎఫ్‌తో రక్షణ మంత్రిత్వ శాఖ డీల్
T-72 బ్రిడ్జి లేయింగ్ ట్యాంకులను సమకూర్చేందుకు చెన్నయ్ లోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీతో రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత సైన్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే T-72 బ్రిడ్జి లేయింగ్ ట్యాంకులను (BLT) సమకూర్చేందుకు చెన్నయ్ లోని అవడిలో ఉన్న హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ (HVF)తో రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం రూ. 1,561 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్, హెచ్ వీఎఫ్ సీనియర్ అధికారుల సమక్షంలో ఈ అగ్రిమెంట్ కుదిరింది. మొత్తం 47 ట్యాంకులను అందజేసేందుకు డీల్ ఖరారైంది. ట్యాంక్-72 బీఎల్‌టీ అనేది యుద్ధభూమిలో ప్రమాదకర, రక్షణాత్మక కార్యకలాపాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఆర్థిక వ్యవస్థను పెంచడంలో, దేశంలో ఉపాధి మార్గాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించింది. కాగా, హెచ్ వీఎఫ్ అనేది ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ కు చెందిన యూనిట్.






