డీప్‌ఫేక్‌ వీడియోల కలకలం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన శశిథరూర్‌

by Kema Shiva Kumar |

తన పేరుతో సోషల్ మీడియాలో చలామణి అవుతున్న డీప్‌ఫేక్ వీడియోలను అడ్డుకోవాలని కోరుతూ ఎంపీ శశి థరూర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

డీప్‌ఫేక్‌ వీడియోల కలకలం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన శశిథరూర్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)‌ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ సృష్టించిన డీప్‌ఫేక్ వీడియోలు తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించాలని, భవిష్యత్తులో వాటి ప్రచురణను అడ్డుకోవాలని కోరుతూ ఆయన ఇవాళ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ మేరకు ఆయన తన పిటిషన్‌లో తన ముఖాన్ని, గొంతును పోలిన విధంగా డీప్‌ఫేక్ వీడియోలను తయారు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది తన వ్యక్తిగత గోప్యతను దెబ్బతీస్తోందని థరూర్ కోర్టుకు విన్నవించారు. ఆ వీడియోలను ఎక్కడా ప్రసారం చేయకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) నిబంధనల ప్రకారం.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ఇటువంటి కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, ఇటీవలే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు డీప్‌ఫేక్ వీడియోల బారిన పడి కోర్టు నుంచి పర్సనాలిటీ రైట్స్‌కు సంబంధించి తమ హక్కలను కాపాడుకున్న విషయం తెలిసిందే.

Next Story