తీవ్ర విషాదం.. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్‌ కన్నుమూత

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-25 08:19:18  IST  )

ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి చైర్మన్ కస్తూరి రంగన్ ఇవాళ గుండెపోటు‌తో కన్నుమూశారు.

తీవ్ర విషాదం.. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్‌ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: ఇస్రో మాజీ డాక్టర్ కృష్ణస్వామి చైర్మన్ కస్తూరి రంగన్ (Dr. Krishnaswamy Chairman Kasturi Rangan) (84) ఇవాళ తుది శ్వాస విడిచారు. బెంగళూరులో తన స్వగృహంలో ఉదయం 10.43కు కన్నమూసినట్లుగా ఇస్రో ప్రతినిధులు వెల్లడించారు. ఈ మేరకు ఆయన భౌతికకాయాన్ని ఏప్రిల్ 27 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు బెంగళూరులోని రామన్ పరిశోధనా సంస్థలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. కాగా, కస్తూరి రంగన్ జేఎన్‌యూ (JNU) ఛాన్సలర్‌గా, కర్ణాటక నాలెడ్జ్‌ కమిషన్‌ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. 2003-2009 వరకు రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. ఇక బెంగళూరు (Bengaluru)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ (National Institute of Advanced Studies)కు డైరెక్టర్‌గా ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Government) తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి కస్తూరి రంగన్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యున్నత పరస్కారాలు అయిన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్నారు.

Next Story