దళపతి విజయ్ మీటింగ్‌లో ఘోరం.. ఇద్దరు మృతి, 10 మందికి సీరియస్

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-27 14:59:56  IST  )

తమిళనాడు(Tamil Nadu)లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

దళపతి విజయ్ మీటింగ్‌లో ఘోరం.. ఇద్దరు మృతి, 10 మందికి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు(Tamil Nadu)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ హీరో, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్(Thalapathy Vijay) మీటింగ్‌లో తొక్కిసలాట జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో పది మంది పరిస్థితి విషమంగా ఉండగా, మరో 22 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయాలైన వారికి కరూర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో విజయ్ దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే ఇటీవల వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా విషాదం చోటుచేసుకోవడం సభలు, సమావేశాలకు ఇక పోలీసులు ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ కాస్త గ్యాప్ తీసుకునే అవకాశాలూ లేకపోలేదు.

Next Story