Deep seek: ఎలన్ మస్క్‌కు భారీ షాక్.. డీప్‌సీక్ దెబ్బకు రూ. 7.9 లక్షల కోట్ల నష్టం !

by B.Srinivas |

చైనాలోని ఏఐ స్టార్టప్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందడంతో టెక్ దిగ్గజాలపై భారీగా పడింది.

Deep seek: ఎలన్ మస్క్‌కు భారీ షాక్.. డీప్‌సీక్ దెబ్బకు రూ. 7.9 లక్షల కోట్ల నష్టం !
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనాలోని ఏఐ స్టార్టప్ డీప్ సీక్ (Deep seek) ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందడంతో దీని ప్రభావం టెక్ దిగ్గజాలపై భారీగా పడింది. ఈ క్రమంలోనే టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ (Elon musk) నెల రోజుల్లోనే దాదాపు రూ. 7.90 లక్షల కోట్లు సంపదను కోల్పోయారని పలు నివేదికలు అంచనా వేశాయి. ఫిబ్రవరి ప్రారంభంలో మస్క్ నికర విలువ 433 బిలియన్ డాలర్లు ఉండగా.. నెలాఖరు నాటికి 349 బిలియన్ డాలర్లకు పడిపోయింది. సుమారు 90 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది.

అలాగే ఇతర టెక్ దిగ్గజాలు సైతం తీవ్రంగా నష్ట పోయారు. ఎన్వీడియా సీఈఓ జెన్సెస్ హువాంగ్ (Jenses huwang) సంపద 20 బిలియన్ డాలర్లు, మెటా సీఈఓ జుకర్ బర్గ్ (Juker barg) సంపద 11 బిలియన్ డాలర్లు, ఒరాకిల్ చైర్మన్ లారీ ఎల్లిసన్ (Laree Ellison) 27.6 బిలియన్ల నష్టాన్ని చవిచూశారు. అయితే నష్టాలు చవిచూసినప్పటికీ ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ డీప్ సీక్‌పై ప్రశంసలు కురిపించారు. ‘ఇది ఒక అద్భుతమైన ఆవిష్కరణ. డీప్ సీక్ ప్రధానంగా ప్రపంచ స్థాయి తార్కిక ఏఐ మోడల్‌ను ఓపెన్ సోర్స్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉత్సాహాన్ని రేకెత్తించింది’ అని తెలిపారు.

Next Story