దీన్‌దయాళ్ పోర్ట్ సరికొత్త జాతీయ రికార్డు.. ‘సింగిల్ డే’లో 7.83 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-27 11:02:09  IST  )

గుజరాత్‌లోని దీన్‌దయాళ్ పోర్ట్ మరో రికార్డును సొంత చేసుకుంది.

దీన్‌దయాళ్ పోర్ట్ సరికొత్త జాతీయ రికార్డు.. ‘సింగిల్ డే’లో 7.83 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ (DPA) సరుకు రవాణాలో సరికొత్త రికార్డు సృష్టించింది. ‘సింగిల్ డే’లో అత్యధిక పరిమాణంలో సరుకును ట్రాన్స్‌పోర్టు చేసి దేశంలోనే సరికొత్త మైలురాయిని అందుకున్నట్లుగా డీపీఏ అధికారికంగా ప్రకటించింది. జూలై 26న కేవలం 24 గంటల వ్యవధిలోనే కాండ్లా పోర్ట్ ఏకంగా 7,83,816 మెట్రిక్ టన్నుల (MT) సరుకును విజయవంతంగా హ్యాండిల్ చేసింది. దీంతో నమోదైన 7,78,570 మెట్రిక్ టన్నుల రికార్డును ఇది అధిగమించింది. పోర్ట్‌కు చెందిన వాడి నార్ (Vadinar) ఆఫ్‌షోర్ ఆయిల్ టెర్మినల్ కూడా ద్రవ కార్గో రవాణాలో తన పాత రికార్డును చెరిపివేసి కొత్త రికార్డు నెలకొల్పింది. 24 గంటల్లో 5,09,101 మెట్రిక్ టన్నుల లిక్విడ్ కార్గోను హ్యాండిల్ చేసి సరికొత్త అధ్యాయం లిఖించింది. ఈ సరుకు రవాణాలో 2,55,557 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్, 40,534 మెట్రిక్ టన్నుల పీఓఎల్ (POL), 2,13,010 మెట్రిక్ టన్నుల ఎల్పీఓ (LPO) ఉన్నాయి.

Next Story