- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశవ్యాప్త కులగణనకు నిర్ణయం.. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
జనాభా గణనతో పాటు కులగణన పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: జనాభా గణనతో పాటు కులగణన పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (AICC Leader Rahul Gandhi) ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై రాహుల్.. కులగణన (Caste Census)ను బీజేపీ (BJP) విభజనవాదంగా పిలిచిందని కానీ తాను కులగణనను నిజం అని పిలిచినట్లు చెప్పారు.
అలాగే కులగణన కోసం ఎన్నో సంవత్సరాలుగా తాను పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఎందుకంటే దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాల్సిన 90 శాతం మంది ప్రజలను మినహాయిస్తే భారతదేశం అభివృద్ధి చెందదు కదా అని తెలిపారు. చివరికి ప్రధానమంత్రి, ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్నే వినాల్సి వచ్చిందని అన్నారు. ఇక కులగణన అనేది దేశ అభివృద్ధి కొత్త నమూనాకు తొలి అడుగు అని రాహుల్ గాంధీ రాసుకొచ్చారు.
కాగా రాహుల్ గాంధీ కులగణన చేపట్టాలని ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జనాభా గణనతో పాటు కులగణన చేసి దేశంలోని వెనుకబడిన తరగతులకు జనాభా ప్రాతిపధికగా రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. అంతేగాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో ఇప్పిటికే కులగణన ప్రక్రియను అమలు చేశారు. ఇక దీనిపై ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జనాభా గణనతో పాటు కులగణన కూడా చేపడతామని నిర్ణయించింది.






