యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య.. హెచ్‌ఓడీని చెంపదెబ్బ కొట్టిన తల్లి.. తీవ్ర ఉద్రిక్తత..(VIDEO)

by Sujitha Rachapalli |

గ్రేటర్ నోయిడాలోని శారదా విశ్వవిద్యాలయంలో విషాదం చోటు చేసుకుంది. 21 ఏళ్ల రెండవ సంవత్సరం బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS) విద్యార్థిని జ్యోతి శర్మ.. మాండెలా గర్ల్స్ హాస్టల్‌లోని తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్‌లో ప్రొఫెసర్స్

యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య.. హెచ్‌ఓడీని చెంపదెబ్బ కొట్టిన తల్లి.. తీవ్ర ఉద్రిక్తత..(VIDEO)
X

దిశ, వెబ్ డెస్క్ : గ్రేటర్ నోయిడాలోని శారదా విశ్వవిద్యాలయంలో విషాదం చోటు చేసుకుంది. 21 ఏళ్ల రెండవ సంవత్సరం బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS) విద్యార్థిని జ్యోతి శర్మ.. మాండెలా గర్ల్స్ హాస్టల్‌లోని తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్‌లో ప్రొఫెసర్స్ డాక్టర్ శైరీ వశిష్ట్, డాక్టర్ మహీందర్ సింగ్ చౌహాన్ మానసికంగా వేధించారని.. సంతకాలు ఫోర్జరీ చేశారని ఆరోపించింది. తనను ఫెయిల్ చేస్తామని బెదిరించారని పేర్కొంది.

ఈ ఘటన తర్వాత జ్యోతి కుటుంబం, సహవిద్యార్థులు యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఈ సమయంలో జ్యోతి తల్లి సునీత డెంటల్ విభాగం హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ (HOD)ని చెంపదెబ్బ కొట్టింది. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో.. పోలీసులు, నిరసనకారుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. పోలీసులు వారిని బలవంతంగా చెదరగొట్టారని కుటుంబం ఆరోపించింది. కాగా పోలీసులు సూసైడ్ నోట్‌లో పేర్కొన్న ఇద్దరు అధ్యాపకులను అరెస్టు చేశారు. విశ్వవిద్యాలయ సిబ్బందితో సహా ఐదుగురిపై ఆత్మహత్యకు ప్రేరేపణ వంటి సెక్షన్ల కింద FIR నమోదు చేశారు. ఇక శారదా విశ్వవిద్యాలయం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యాపకులను సస్పెండ్ చేసింది. పరిస్థితులను పరిశీలించడానికి ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

VIDEO

Next Story