- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుక్కలా? మనుషులా? సుప్రీం తీర్పుతో సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైట్
కుక్కల బెడద నుండి విముక్తి కోసం ఢిల్లీలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలి అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: కుక్కల బెడద నుండి విముక్తి కోసం ఢిల్లీలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలి అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. గురుగ్రామ్, నోయిడా మరియు ఘజియాబాద్ అన్ని ప్రాంతాల్లోని వీధి కుక్కులను తరలించాలని పేర్కొంది. వీధుల్లో కుక్కలు తిరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు ఇలా తీర్పు ఇవ్వడం సంచలనంగా మారింది. జంతువుల స్వేచ్ఛను హరించడమే అంటూ డాగ్ లవర్స్ ఆందోళన చెందుతున్నారు. సుప్రీం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు అనంతరం సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. డాగ్ వర్సెస్ హ్యూమన్ లవర్స్ మాధిరిగా విడిపోయి నెటిజన్లు డిబేట్స్ పెట్టుకుంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చాలా మంచి తీర్పు ఇచ్చిందని ఇతరులు చెబుతుంటే, డాగ్ లవర్స్ మాత్రం వ్యతిరేకిస్తున్నారు. సుప్రీం తీర్పు అసలు ఆమోదయోగ్యం కాదని, అలా తీర్పు ఇచ్చే హక్కు కోర్టుకు కూడా లేదని అంటున్నారు.
కుక్కుల తరలింపును సమర్దిస్తూ రేబీస్ తో అల్లాడిపోతూ చనిపోయిన వ్యక్తుల వీడియోలను కొందరు షేర్ చేయగా ఆ వీడియోలకు డాగ్ లవర్స్ కామెంట్స్ పెడుతున్నారు. కేవలం కుక్కుల వల్ల మాత్రమే కాకుండా అనేక కారణాల వల్ల మనుషులు చనిపోతారని అలా అన్నింటినీ బ్యాన్ చేయలేం కదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రతిరోజు మనుషులు లక్షల్లో కోళ్లను, మేకలను చంపుకుని తింటున్నారని మరి మనుషులను ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకుంటూ వ్యాక్సిన్లు వేస్తే కుక్కులతో ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు. మరోవైపు చాలా మంది సెలబ్రెటీ డాగ్ లవర్స్ సైతం కుక్కులపై సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తున్నారు.






