- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢాకా విమాన ప్రమాదం.. 19 కి చేరిన మృతుల సంఖ్య
ఢాకా(Dhaka)లో ఓ కాలేజీ భవనంపై ఎయిర్‌ఫోర్స్ (Airforce) శిక్షణ విమానం కుప్పకూలిన(Plane crash) ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఢాకా(Dhaka)లో ఓ కాలేజీ భవనంపై ఎయిర్‌ఫోర్స్ (Airforce) శిక్షణ విమానం కుప్పకూలిన(Plane crash) ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 19 మంది విద్యార్థులు మృతి చెందగా.. మరో 174 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 1.06కు బంగ్లాదేశ్‌లోని నార్త్ ఢాకా (North Dhaka)లోని మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ క్యాంపస్‌పై బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన ఓ శిక్షణ విమానం పైలట్ నియంత్రణ కోల్పోవడంతో కుప్పకూలినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ ఎఫ్-7 బీజీఐ (F-7 BGI) బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందినది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
Next Story






