బీజాపూర్ ఎన్కౌంటర్.. 15 కు చేరిన మృతుల సంఖ్య

by Muthe.Rajitha |

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-బీజాపూర్ సరిహద్దులో భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య బుధవారం ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే.

బీజాపూర్ ఎన్కౌంటర్.. 15 కు చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-బీజాపూర్ సరిహద్దులో భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య బుధవారం ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తొలుత ముగ్గురు మావోయిస్టులు మాత్రమే చనిపోయారని వార్తలు వచ్చినప్పటికీ.. తాజాగా ఈ ఎన్కౌంటర్లో 15 మంది దాకా చనిపోయినట్టు సమాచారం. మృతి చెందిన వారిలో 12 మంది మావోయిస్టులు ఉండగా.. ముగ్గురు జవాన్లు ఉన్నారని తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

మృతి చెందిన వారిలో ఎవరైనా అగ్రనేతలు ఉన్నారా అనే విషయం ఇంకా తెలియ రాలేదు. మృతుల వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలంలో భారీ పెద్ద ఎత్తున ఆయుధాలు లభ్యం అయ్యాయి. జనవరి 1న మావోయిస్టు పార్టీ అగ్రనేతలతోసహా సభ్యులు అంతా లొంగిపోతామని ఇటీవల అభయ్ పేరిట ప్రకటన వెలువడి వారం రోజులు గడవక ముందే ఈ భారీ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం.

Next Story