టెక్సాస్‌‌లో 109కి చేరిన మృతుల సంఖ్య.. ఇంకా పెరగొచ్చన్న గవర్నర్

by Phanindra |

టెక్సాస్‌‌ వరదల్లో మృతుల సంఖ్య 109కి చేరింది. అలాగే 160 మంది వరకు కనిపించకుండా పోయారు. ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చని గవర్నర్ అన్నారు.

టెక్సాస్‌‌లో 109కి చేరిన మృతుల సంఖ్య.. ఇంకా పెరగొచ్చన్న గవర్నర్
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్‌లోని టెక్సాస్‌ను ముంచెత్తిన వరదల్లో మృతుల సంఖ్య 109 మందికి చేరింది. అలాగే 160 మందికిపైగా ప్రజలు కనిపించకుండా పోయారని టెక్సాస్ ప్రభుత్వం వెల్లడించింది. నాలుగు రోజుల క్రితం పలు కౌంటీలను వరదలు ముంచెత్తాయి. ఇప్పటి వరకు ఎంతోమంది జాడలు తెలియకపోవడం వారంతా మరణించి ఉంటారని పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలో టెక్సాక్ గవర్నర్ గ్రెగ్ ఆబాట్ మాట్లాడుతూ.. కనిపించకుండా పోయిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ‘కేవలం కెర్ కౌంటీలోనే 161 మంది కనిపించకుండా పోయారు. ఈ గణాంకాలు మరింత పెరిగే అవకాశం ఉంది’ అని ఆయన చెప్పారు. ఈ కౌంటీలోనే 94 మంది మరణించినట్లు అధికారులు చెప్తున్నారు.

Next Story