- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sudan: సూడాన్ లో కుప్పుకూలిన సైనిక విమానం.. 46 మంది మృతి
సూడాన్ (Sudan)లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సైనిక విమానం కుప్పకూలిన ఘటనలో 46 మంది చనిపోయారు.

దిశ, నేషనల్ బ్యూరో: సూడాన్ (Sudan)లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సైనిక విమానం కుప్పకూలిన ఘటనలో 46 మంది చనిపోయారు. వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి సైనిక విమానం టేకాప్ అయిన కాసేపటికే ఓమ్‌దుర్మాన్ నగరంలో సూడాన్ సైనిక విమానం కూలిపోయింది. సైనిక సిబ్బందితో పాటు పలువురు పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో పది మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పది మందికి పైగా గాయపడినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదని.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
2023 నుంచి అంతర్యుద్ధం
2023 నుండి సుడాన్ లో అంతర్యుద్ధం జరుగుతోంది. సూడాన్ (Sudan)పై పట్టు కోసం సైన్యం (Army), పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో న్యాలా ప్రాంతంలో ఇటీవల ఓ సైనిక విమానాన్ని కూల్చివేసినట్లు డార్ఫర్ పశ్చిమ ప్రాంతాన్ని నియంత్రిస్తున్న ఆర్‌ఎస్‌ఎఫ్ ప్రకటించింది. అయితే ప్రస్తుత ప్రమాదానికి ఈ ఘర్షణలకు సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు, డార్ఫర్ పశ్చిమ ప్రాంతంలో గ్యాంగ్ రేప్స్, హత్యలు వంటి దారుణాలు జరుగుతున్నట్లు ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం పేర్కొంది. ఇవన్నీ యుద్ధనేరాలతో సమానం అని ఆవేదన వ్యక్తం చేసింది.






