- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gen Z Protests: నేపాల్ ఆందోళనలో పిట్టల్లా రాలిపోయిన యువకులు (వీడియో).. భారత సైన్యం అలర్ట్
నేపాల్ ఆందోళనలో తీవ్ర హింస చోటు చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాను బ్యాన్ (social media ban) చేస్తూ నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ దేశంలో జరిగిన ఆదోళనలు హింసకు దారి తీసింది. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేయాలంటూ ఇవాళ జెన్ జెడ్ పేరుతో (Nepal Gen Z protests) యువత కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కసారిగా రోడ్లపైకి రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సోషల్ మీడియా బ్యాన్ కు వ్యతిరేకంగా మొదలైన ఈ ఆందోళన చివరకు ఆ దేశంలోని అవినీతిపై నిరసనగా మారింది. మెరుపు ఆందోళనపై భద్రతా దళాలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 14 మంది చనిపోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పోలీసుల కాల్పుల్లో యువకులు పిట్టల్లా రాలిపోతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
భారత సైన్యం అలర్ట్:
నేపాల్‌లో కొనసాగుతున్న నిరసనల దృష్ట్యా భారత సైన్యం అప్రమత్తం అయింది. ఉత్తరాఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం వంటి రాష్ట్రాలలో 1,751 కి.మీ.లకు పైగా విస్తరించి ఉన్న భారతదేశం- నేపాల్ సరిహద్దు వెంబడి ఇరు దేశాల పౌరుల కదలికలపై నిఘా పెంచాలని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. భారత సరిహద్దు కాపలా దళం సశస్త్ర సీమా బల్ (SSB) నిఘాను మరింతగా పెంచింది. భారత భూభాగంలో అశాంతి చెలరేగకుండా నిరోధించడానికి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. సున్నితమైన సరిహద్దు అవుట్‌పోస్టులలో కఠినమైన తనిఖీలు అమలు చేస్తున్నారు. భద్రతను కొనసాగిస్తూనే ప్రజల కదలికలు సజావుగా సాగేలా స్థానిక పరిపాలనతో సమన్వయాన్ని కూడా ముమ్మరం చేశారు.
జనముద్రంలా కాఠ్మాండ్:
ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహంతో రగిలిపోతున్న యువత ఇవాళ జెన్ జెడ్ పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. వేలాది మంది ప్రజలు ఆందోళనలో పాల్గొనడంతో ఆ దేశ రాజధాని కాఠ్మాండు జనసముద్రంలా మారిపోయింది. పోలీసులు ప్రకటించిన నిషేధిత జోన్లను సైతం లెక్క చేయని ఆందోళన కారులు ఏకంగా పార్లమెంట్ లోకి దూసుకెళ్లారు. అయితే ఈ ఆందోళనలో 26 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారే ఉండటం విశేషం. నిషేధాజ్ఞలు సోషల్ మీడియాపై కాదు అవినీతిపై విధించాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. సోషల్ మీడియాపై బ్యాన్ విధించడాన్ని వ్యతిరేకించడంతో పాటు ఆందోళనకారుల డిమాండ్ ను సైతం తెరమీదకు తీసుకువచ్చారు. దేశంలో వేళ్లూనుకుపోయిన అవినీతికి వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతున్నామని కొంతమంది యువత చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. దేశంలోని పన్ను చెల్లింపుదారుల డబ్బు ఎక్కడికి పోయిందని వారంతా ప్రశ్నించినట్లు మీడియా రిపోర్టు చేసింది.






