గుజరాత్‌ బ్రిడ్జి ఘటన.. 13కు చేరిన మృతుల సంఖ్య

by velandi.Saikiran |

గుజరాత్ రాష్ట్రంలో ( Gujarat) నిన్న జరిగిన బ్రిడ్జి ఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే బ్రిడ్జి (

గుజరాత్‌ బ్రిడ్జి ఘటన.. 13కు చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ రాష్ట్రంలో ( Gujarat) నిన్న జరిగిన బ్రిడ్జి ఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే బ్రిడ్జి ( Gujarat Bridge) కుప్పకూలిన సంఘటనలో.. మృతుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ సంఘటనలో 13 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటన చేశారు. మరి కొంత మంది... మరణించే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. ఇక ఈ సంఘటనలో మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi).

అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 50 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అటు ఈ సంఘటనలో 14 మందిని రక్షించామని.. మరో ఐదు మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది ఇలా ఉండగా గుజరాత్ లోని మహిసాగర నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి (Gujarat Gambhira bridge) కూలింది. ఈ సంఘటన నిన్న మధ్యాహ్నం చోటు చేసుకుంది. బ్రిడ్జి కూలడంతో వాహనాలు నదిలో పడ్డాయి. వడదొర అలాగే ఆనంద జిల్లాలను కలిపే ప్రధాన వంతెన గా గంభీర బ్రిడ్జి ఉంది.

Next Story