- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్‌లో కూలిన బిల్డింగ్.. 27కు చేరిన మృతుల సంఖ్య
పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఐదంతస్తుల బిల్డింగ్ కుప్పకూలిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఐదంతస్తుల బిల్డింగ్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 27 కు చేరిందని అధికారులు ప్రకటించారు. మృతుల్లో 15 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. శిథిలాల తొలగింపు తుది దశకు చేరుకుందని వివరించారు. ప్రాణాలతో బయటపడ్డ వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రిపూట నిర్వహించిన ఆపరేషన్‌లో శిథిలాల నుంచి మరో 10 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీసినట్లు అధికారులు శనివారం తెలిపారు. గాయపడిన వారిలో చాలా మందిని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్న కనీసం ఎనిమిది మంది ప్రాణాలతో బయటపడిన వారి కోసం రెస్క్యూ సిబ్బంది భారీ యంత్రాలను ఉపయోగిస్తున్నారని అత్యవసర అధికారులు తెలిపారు. 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకుందని స్థానిక అధికారులు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.






