- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెలరోజుల వర్షం కొన్ని గంటల్లోనే.. భారీ వరదలు.. 24 మంది మృతి
ఒక నెలలో కురవాల్సిన వర్షం.. కొన్ని గంటల్లోనే కురిస్తే ఆ విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించడానికే దారుణంగా ఉంటుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఒక నెలలో కురవాల్సిన వర్షం.. కొన్ని గంటల్లోనే కురిస్తే ఆ విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించడానికే దారుణంగా ఉంటుంది. అమెరికాలోని టెక్సాస్ లో కొన్ని గంటల్లో భారీ వర్షం కురవడంతో (Texas Flash Floods) ఆ రాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారింది. ఆకాశానికి చిల్లు పడిందా? అన్న చందంగా వర్షం కురవడంతో భారీ వరదలు ముంచెత్తాయి. దీంతో 24 మంది మృతి చెందగా.. అనేకమంది వరదల్లో గల్లంతయ్యారు. వారిలో 23 మంది బాలికలు కూడా ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కెర్ కౌంటీలో ఒక్కరాత్రిలో 25 సెంటీమీటర్ల వర్షం కురవడంతో గ్వాడాలుపే నదిలో వరద పోటెత్తింది.
టెక్సాస్ హిల్ కంట్రీలోని (Texas Hill Country) క్యాంప్ మిస్టిక్ అనే సమ్మర్ క్యాంప్ కు హాజరైన 750 మంది బాలికల్లో 23 మంది గల్లంతయ్యారు. గల్లంతైన బాలిక ఆచూకీ తెలియజేయాలంటూ సోషల్ మీడియాలో వారి తల్లిదండ్రులు ఫొటోలు షేర్ చేస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న 200 మందికి పైగా ప్రజలను రక్షించారు.






