- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Stalin: డీలిమిటేషన్ మెమోను సమర్పించేందుకు టైం కావాలి- మోడీకి స్టాలిన్ లేఖ
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశానికి వ్యతిరేకంగా పోరుకి సిద్ధమయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశానికి వ్యతిరేకంగా పోరుకి సిద్ధమయ్యారు. డీలిమిటేషన్‌కు సంబంధించిన మెమోను సమర్పించడానికి ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi)ని స్టాలిన్ సమయం కోరారు. ఈమేరకు మార్చి 27న స్టాలిన్ మోడీకి లేఖ రాశారు. ఆ లేఖను స్టాలిన్ బుధవారం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 'న్యాయమైన డీలిమిటేషన్'పై మార్చి 22న జరిగిన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సమావేశం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీలతో సహా దేశంలోని అగ్ర నేతలు, విభిన్న రాజకీయ సిద్ధాంతాలకు చెందిన నాయకులను ఒకచోట చేర్చింది. మా చర్చల నుండి వెలువడే స్వరాలు రాజకీయ సరిహద్దులను దాటి, మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో న్యాయమైన ప్రాతినిధ్యం కోరుకునే విభిన్న ప్రాంత ప్రజల ఆందోళనలను ప్రతిబింబిస్తాయి. జాయింట్ యాక్షన్ కమిటీ తరపున అధికారికంగా మెమోరాండంను సమర్పించడానికి మీతో సమావేశం కావాలని నేను అభ్యర్థిస్తున్నాను’ అని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు. స్టాలిన్"న్యాయమైన డీలిమిటేషన్" కోసం పిలుపునిచ్చారు. ఇది ఎంపీల సంఖ్య గురించి కాదని.. రాష్ట్రాల హక్కుల గురించి అని సూచించారు.
వివిధ పార్టీల నేతలతో భేటీ
డీలిమిటేషన్(Delimitation) వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందన్న విషయమై చర్చించేందుకు వివిధ పార్టీల నేతలతో ఇటీవలే స్టాలిన్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. డీలిమిటేషన్‌పై పలు తీర్మానాలు చేశారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరగనుంది. ఇందుకు అనుసరించే విధివిధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందన్న ఆందోళన రేగుతోంది. న్యాయబద్ధంగా, పారదర్శకంగా డీలిమిటేషన్ చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా కేరళ సీఎం పినరయి విజయన్ ఎలాంటి చర్చలు చేపట్టకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం భావిస్తోందని ఆరోపించారు. దానివల్ల నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు.






