- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూతురు విడాకులు.. పేరెంట్స్ గ్రాండ్ సెలబ్రేషన్స్
ఒక రిటైర్డ్ జడ్జి తన కూతురికి విడాకులు మంజూరు కావడంతో ఆమెను పుట్టింటి వారు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. ఇది సమాజంలో కొత్త ట్రెండ్ ను సూచిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పెళ్లి అంటే నూరేళ్లు కలిసి సాగాల్సిన ప్రయాణం. కానీ కొంత మంది జీవితాల్లో ఇది పూర్తిగా భిన్నమైన పరిస్థితులు రావచ్చు. తమ జీవిత భాగస్వామితో ఏర్పడే పొరపచ్చాలు, ఇతర కారణాలతో విడాకుల వరకు దారి తీయవచ్చు. డైవర్స్ అంటే తమ తమ జీవితాల్లో అది పెద్ద విషాదమే. కానీ యూపీలోని మీరట్‍లో (Meerut) మాత్రం తమ కూతురుకి విడాకులు మంజూరు కావడంతో ఆమె తల్లిదండ్రులు గ్రాండ్‍గా సెలబ్రేషన్స్ (Daughter Divorce Celebration) చేశారు. డప్పులు వాయిస్తూ డాన్సులు చేశారు. ‘ఐ లవ్ మై డాటర్’ అని ముద్రించి ఉన్న టీ షర్టులు ధరించి ఆమెను పుట్టింటివారు ఆనందంగా స్వాగతించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.
రిటైర్డ్ జడ్జి కూతురికే ఈ కష్టం:
రిటైర్డ్ జడ్జి జ్ఞానేంద్ర శర్మ ఏకైక కుమార్తె ప్రణిత శర్మకు 2018 డిసెంబర్ 14న ఆర్మీ మేజర్‍తో వివాహం జరిగింది. ఈ జంట అన్యోన్యంగా జీవితం కొనసాగిస్తుందని బంధువులంతా భావించారు. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టిన ప్రణితకు అక్కడ పరిస్థితులు భిన్నంగా కనిపించారు. కాలం గడిచే కొద్ది అత్తామామల వేధింపులు మరింత కఠిన తరం అయ్యాయి. దీంతో ఆమె మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొడుకు పుట్టాక కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో ఇక కఠిన నిర్ణయం తీసుకుంది. ఇక తన భర్త కుటుంబం వేధింపులను భరించలేనని తనకు విడాకులు ఇప్పించాలంటూ మీరట్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన కోర్టు 4 ఏప్రిల్ 2026న విడాకులు మంజూరు చేసింది. సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ప్రణీత ఓ జ్యుడిషియల్ అకాడమిలో ఫైనాన్స్ డైరెక్టర్‍గా పని చేస్తున్నారు. తనకు విడాకులు మంజురైన సందర్భంగా తన అనుభవాన్ని పంచుకుంటూ ఎలాంటి వేధింపులైనా ఎదురైనప్పుడు మౌనంగా ఉండవద్దని, అలాగే మీ కూతురికి పెళ్లి చేసే విషయంలో తొందరపడవద్దని తల్లిదండ్రులకు సూచించారు. మీమీ కూతుర్లను చదివించాలని తన కాళ్లపై నిలబడేలా తీర్చిదిద్ది ఆ తర్వాతే వివాహం చేయాలని కోరారు.
కొత్త ట్రెండ్:
ప్రణీత విడాకుల సందర్భంగా ఆమె తల్లిదండ్రులు అనుసరించిన తీరు ఇప్పుడు సమాజంలో కొత్త ట్రెండ్‍ను సూచిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కుతురు విడాకులు అంటే భారంగా, అవమానంగా భావించే తల్లితండ్రులు అవేవి పట్టించుకోకుండా ఆమెను డబ్బులతో, డ్యాన్స్ లతో ఆహ్వానించడం గొప్ప విషయం అని స్పందిస్తున్నారు. సాధారణంగా పెళ్లి అంటే బాజాభజంత్రీలతో సందడి చేసే సమాజం, విడాకులు అంటే మాత్రం ఒక విషాదంగా, అవమానంగా చూస్తుంది. కానీ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాకు చెందిన ఒక కుటుంబం ఈ పాత చింతకాయ పద్ధతులకు స్వస్తి పలికింది. తన కూతురు విడాకులను భారంగా భావించకుండా, ఆమెకు దక్కిన స్వేచ్ఛగా భావించి డప్పులతో, డ్యాన్స్‌లతో వేడుక చేసుకున్నారు.






