రెండేళ్లుగా లైంగిక వేధింపులు.. మామ ప్రైవేట్ పార్ట్‌ కోసేసిన కోడలు

by Ramesh Naini |

తనపై గత రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఆరోపణలతో 67 ఏళ్ల మామ మర్మాంగాన్ని 23 ఏళ్ల కోడలు కోసేసింది.

రెండేళ్లుగా లైంగిక వేధింపులు.. మామ ప్రైవేట్ పార్ట్‌ కోసేసిన కోడలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. తనపై గత రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఆరోపణలతో 67 ఏళ్ల మామ మర్మాంగాన్ని 23 ఏళ్ల కోడలు కోసేసింది. ముజఫర్‌నగర్ జిల్లా బుధానా పరిధిలోని సఫీపూర్ పట్టిలో శుక్రవారం (జూలై 17న) ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం.. సయ్యదా(23) అనే మహిళ భర్త హర్యానాలో ఆటో రిక్షా నడుపుతూ ఎక్కువ కాలం అక్కడే ఉంటున్నాడు. దీంతో ఆమె తన ఇద్దరు కుమారులు, మామ జాకిర్(67)తో కలిసి ముజఫర్‌నగర్‌లో నివసిస్తోంది. ఒంటరిగా ఉంటున్న కోడలిపై మామ కన్నేశాడు. గత రెండేళ్లుగా ఆమెపై నిరంతరం అత్యాచారానికి, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ నరకం గురించి ఆమె ఇరుగుపొరుగు వారికి ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన సయ్యదా.. శుక్రవారం బ్లేడుతో తన మామ మర్మాంగాన్ని కోసేసింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న జాకిర్‌ను స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. నిందితురాలు సయ్యదాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు బుధానా సర్కిల్ ఆఫీసర్ గజేంద్ర పాల్ సింగ్ తెలిపారు. అయితే, ఇప్పటివరకు ఇరు వర్గాల నుంచి ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందిన తర్వాత సాక్ష్యాధారాల ఆధారంగా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story