దారుణం.. అత్త జుట్టు పట్టి లాక్కెళ్లి.. తలను గోడకు కొట్టి.. హింసించిన కోడలు.. (వీడియో)

by Sujitha Rachapalli |

అత్తకు అమ్మ స్థానం ఇవ్వకపోవచ్చు కానీ కనీసం వయసుకైనా గౌరవమిస్తరు. ఒకవేళ చెప్పేది, చేసేది నచ్చకపోతే మనసులో ఏమున్నా పైకి మాత్రం ఓకే అంటరు.

దారుణం.. అత్త జుట్టు పట్టి లాక్కెళ్లి.. తలను గోడకు కొట్టి.. హింసించిన కోడలు.. (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: అత్తకు అమ్మ స్థానం ఇవ్వకపోవచ్చు కానీ కనీసం వయసుకైనా గౌరవమిస్తరు. ఒకవేళ చెప్పేది, చేసేది నచ్చకపోతే మనసులో ఏమున్నా పైకి మాత్రం ఓకే అంటరు. కానీ ఈ కోడలు మాత్రం అత్తను దారుణంగా హింసింది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన కోడలు.. అత్త జుట్టు పట్టి లాక్కుని వెళ్తూ.. తలను గోడకేసి కొట్టింది. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని గోవిందాపురంలో ఈ ఘటన జరగ్గా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోడలు ఆకాంక్ష తండ్రి పోలీసు శాఖలో పని చేస్తుండగా.. ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.

VIDEO

Next Story