- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియాలో రాయల్ స్టాగ్ రేటుకు జపాన్‌లో జానీ వాకర్.. మద్యం వ్యాపారం వెనుక మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు
మన దేశంలో చాలా మంది మద్య తరగతి, ఎగువ మద్య తరగతి ప్రజలు తాగే విస్కీ రాయల్ స్టాగ్. దీని ధర ఫుల్ బాటిల్‌కు రూ.880 అయితే జపాన్‌లో దాదాపు ఇదే ధరకు అక్కడి కరెన్సీలో 10డాలర్లకు అంటే ఇండియన్ కరెర్సీలో రూ.900లకు జానీ వాకర్ రెడ్ లేబుల్ ఫుల్ బాటిల్ ఎందుకు వస్తుంది?

దిశ, వెబ్ డెస్: భారత్‌లో మద్యం అమ్మకాలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిఏడాది అమ్మకాలు పెరుగుతూనే ఉంటాయి. చాలా రాష్ట్రాలకు మద్యం ప్రధాన ఆదాయ వనరుగా మారింది అనడంలో ఎలాంటి సందేహం అవసరంలేదు. అయితే అలాంటి ఆదాయం తీసుకువచ్చే వ్యాపారం వెనుక దాగి ఉన్న నిజాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. వేలకు వేలు ఖర్చు చేస్తూ ఇలాంటి మద్యాన్నా తాగేది అని ఆశ్చర్యపోవాల్సిందే. మన దేశంలో చాలా మంది మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలు తాగే విస్కీ రాయల్ స్టాగ్. దీని ధర ఫుల్ బాటిల్‌కు రూ.880.. అయితే జపాన్‌లో దాదాపు ఇదే ధరకు అక్కడి కరెన్సీలో 10డాలర్లకు అంటే ఇండియన కరెర్సీలో రూ.900లకు జానీ వాకర్ రెడ్ లేబుల్ ఫుల్ బాటిల్ వస్తుంది. ధర ఒకే విధంగా ఉన్నా జానీవాకర్ స్కాచ్. ఇండియాలో అదే ధరకు అమ్మే రాయల్ స్టాగ్ ఒక రెక్టిఫైడ్ స్పిరిట్.. అంటే దీనిని రసాయనాలతో తయారు చేస్తారు. ఇండియాలో అమ్మే విస్కీ, జిన్, రమ్ అన్నింటినీ రెక్టిఫైడ్ స్పిరిట్ తోనే తయారు చేస్తున్నారు.
రెక్టిఫైడ్ స్పిరిట్ ఎలా తయారు చేస్తారు?
దీనినే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అని పిలుస్తారు. చెరుకు వ్యర్థాలు, తడిసిన బియ్యం, నూకలు, వడ్లు మరియు నాసిరకం మొక్కజొన్నలతో దీనిని తయారు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ తయారు చేసే కేంద్రాలు 20వరకు ఉన్నాయి. మద్యం కంపెనీలు ఈ స్పిరిట్ లీటర్ 70 రూపాయలకు కొనుగోలు చేసి అందులో సగం నీళ్లు కలిపి రుచి, వాసన కొసం కొన్ని రసాయనాలను కలుపుతారు. ఒక లీటర్ స్పిరిట్ తో మూడు ఫుల్ బాటిళ్ల మద్యం తయారు చేస్తారు. అలా తయారు చేసిన బాటిళ్లనే బ్రాండ్ ను బట్టి వేల రూపాయలకు అమ్ముతున్నారు. నిజానికి స్కాచ్ తయారు చేయాలంటే 5 నుండి 20 సంవత్సరాల వరకు పడుతుంది. కానీ రసాయనాలతో మన దగ్గర తయారు చేసే మద్యం 10 రోజుల్లోనే రెడీ అయిపోతుంది. దానిని అతి తక్కువ ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసి భారీగా రేటు పెంచి అమ్ముతుంది. ఉదాహరణకు రాయల్ స్టాగ్ విస్కీ చూసినట్టయితే ప్రభుత్వం దీనిని కేవలం రూ.130 లకు కొనుగోలు చేస్తుంది.
మద్యంపై ప్రభుత్వం ఎలాంటి పన్నులు విధిస్తుంది?
ఆ తరవాత దానిపై పన్నుల మోత మోగిస్తుంది. రూ.130కి కొనుగోలు చేసిన బాటిల్ పై అఫీషియల్ ఎక్సైజ్ డ్యూటీ రూ.58, స్పెషల్ ఎక్సైజ్ సెస్ రూ.42, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ రూ. 156, ప్రభుత్వ రంగ బేవరేజెస్ కార్పోరేషన్ మార్జిన్ రూ.40 ఇలా పన్నుల భారంతో బాటిల్ ధర రూ.431కి చేరుతుంది. దానిపై మరో 70శాతం వ్యాట్ వేస్తారు. దాంతో బాటిల్ ధర ఏకంగా రూ.732కు చేరుతుంది. దీనిపై వైన్ షాప్ మార్జిన్ 20 శాతం అంటే మరో రూ.146 అవుతుంది. దీంతో బాటిల్ ధర రూ.880కి చేరతుంది. అయితే ఈ బాటిల్ అమ్మితే వైన్ షాపుకు వచ్చేది రూ.30, 40 కంటే ఎక్కువ ఉండదు. అదే విధంగా తయారు చేసిన కంపెనీకి రూ.20 నుండి రూ.30 వరకు మిగులుతుంది. కానీ ప్రభుత్వాలకు దాదాపు ఒక బాటిల్ పైనే రూ.700వరకు లాభం వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు కోటి మంది మద్యం సేవిస్తున్నారు. వారిలో ఒక్కొక్కరు సగటున ఏడాదికి రూ.40వేల వరకు మద్యంపై ఖర్చు చేస్తారు. అంటే మద్యం తాగే వ్యక్తుల నుండి సగటున ప్రభుత్వానికి ఏడాదికి రూ.30వేల వరకు పన్నుల రూపంలో వెళుతుంది. తెలుగు రాష్ట్రాలకు మద్యం ద్వారా వచ్చే ఆదాయమే ఏడాదికి దాదాపు రూ.70వేల వరకు ఉంటుంది.
పన్నులు విధిస్తే మద్యం మానేస్తారా?
పన్నులు విధిస్తే మద్యం తాగడం మానేస్తారు అని ప్రభుత్వాలు చెబుతుంటాయి కానీ అది ఉత్త ముచ్చటే. ఎంత ధర పెంచినా తాగుతారు అని ప్రభుత్వాలకు సైతం తెలుసు. నిజంగా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే మద్యం మాన్పించడానికి రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం లేదా ఇతర మార్గాలను ఆచరిస్తాయి. అంతే కాకుండా కెమికల్ మద్యం కాకుండా నాణ్యమైన మద్యాన్ని ప్రజలకు అందించాలంటే మద్యం కంపెనీలకు లైసెన్స్ రాజ్ నుండి విముక్తి కల్పించాలి. నాణ్యత మరియు ధరపై కంపెనీలను పోటీ పడనివ్వాలి. అలా చేస్తే జపాన్ మాధిరిగానే మన దగ్గర కూడా రూ.900లకే స్కాచ్ లాంటి నాణ్యమైన మద్యం దొరుకుతుంది. ప్రజల ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం పడకుండా ఉంటుంది.






