- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dallewal : దల్లేవాల్‌కు వైద్య సాయం.. కేంద్రం హామీతో అంగీకారం
55 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ వైద్య సాయం తీసుకోవడానికి అంగీకరించాడు.

దిశ, నేషనల్ బ్యూరో: పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 55 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ (Jagjith singh dallewal) వైద్య సాయం తీసుకోవడానికి అంగీకరించాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి చర్చల ప్రతిపాదన అందడంతో ఆయన వైద్య సాయం తీసుకునేందుకు అనుమతించగా డాక్టర్లు గ్లూకోజ్ ఎక్కించారు. అనంతరం దల్లేవాల్‌కు మద్దతుగా దీక్ష చేస్తున్న 121 మంది రైతులు సైతం నిరవధిక దీక్షను ముగించారు. అంతకుముందు శనివారం రాత్రి కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రియా రంజన్ దల్లేవాల్‌తో సమావేశమయ్యారు. ఫిబ్రవరి 14న చండీగఢ్‌లో రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే దల్లేవాల్ వైద్య సాయం తీసుకునేందుకు ఒప్పుకున్నారు. అయితే పంటలకు కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇచ్చే వరకు దల్లేవాల్ తన నిరవధిక నిరాహార దీక్షను విరమించేది లేదని రైతు నాయకులు తేల్చి చెప్పారు.






