బెంగాల్ పాలిటిక్స్‌లోకి ‘దాదా’ ఎంట్రీ? బీజేపీ నేతతో సౌరవ్ గంగూలీ భేటీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-07 02:29:08  IST  )

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల వేళ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేత పీఎన్ పాఠక్‌తో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

బెంగాల్ పాలిటిక్స్‌లోకి ‘దాదా’ ఎంట్రీ? బీజేపీ నేతతో సౌరవ్ గంగూలీ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడిన వేళ పశ్చిమ బెంగాల్‌ (West Bengal) రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ‘బెంగాల్ టైగర్’ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) తన నివాసంలో బీజేపీ నేత పీఎన్ పాఠక్‌ (P.N. Pathak)తో సుమారు 2 గంటలకు పైగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC), బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే తరుణంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో గంగూలీ త్వరలోనే కాషాయ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది.

అయితే, ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమేనా, లేక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, గతంలో కూడా గంగూలీ రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వచ్చినప్పటికీ, ఆయన వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు. కానీ, తాజా ఫలితాల తర్వాత మారిన రాజకీయ సమీకరణాల్లో ‘దాదా’ ఏ నిర్ణయం తీసుకుంటారోనని బెంగాల్‌తో పాటు దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story